పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లు సంక్రాంతి సంబరాలు(Palakollu Sankranti Sambaralu) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఆకట్టుకుంటున్నాయి
పాలకొల్లు:
“రండి… తరలి రండి… పండుగ ఆనందాన్ని తిలకించండి!”
పాలకొల్లు పట్టణం సంక్రాంతి పండుగ శోభతో కళకళలాడుతోంది. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలకొల్లు సంక్రాంతి సంబరాలు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకలు సంప్రదాయం, సంస్కృతి, ఉత్సాహాన్ని ఒకే వేదికపై ప్రతిబింబిస్తున్నాయి.
సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలను బీఆర్‌ఎంవీ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ, కార్యక్రమాలు సవ్యంగా సాగేందుకు పలు సూచనలు చేశారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సంప్రదాయం, సంస్కృతి, సంతోషం సమన్వయంగా మేళవించిన ఈ సంక్రాంతి సంబరాలు(Palakollu Sankranti Sambaralu)పాలకొల్లుకు ప్రత్యేక పండుగ శోభను తీసుకొస్తున్నాయి.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో క్రీడాభిమానులకు పండుగ
పాలకొల్లు సంక్రాంతి సంబరాల్లో భాగంగా, కీర్తిశేషులు ఆడిటర్ కలిదిండి రామరాజు స్మారకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది.
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ పోటీల్లో, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కబడ్డీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రతి మ్యాచ్ చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అద్భుతమైన రైడ్లు, సమయోచిత టాకిల్స్, జట్టు సమన్వయంతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.
జాతీయ స్థాయి క్రీడాకారుల ఆటతీరుతో పాలకొల్లు క్రీడా ప్రాంగణం నిజంగా కబడ్డీ కేరాఫ్‌గా మారింది.
Palakollu Sankranti Sambaralu:సెమీఫైనల్, ఫైనల్‌కు చేరువైన జట్లు
మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు నేతృత్వంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా, మంగళవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పురుషులు, మహిళల విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకునేందుకు పలు జట్లు పోటీ పడ్డాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
బుధవారం ఉదయం నుంచి సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్రీడా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
భోగి పండుగ సందర్భంగా గేయ రచయిత అనంత శ్రీరామ్‌ను కలిసిన మంత్రి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి రోజున, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ నివాసానికి వెళ్లారు. దొడ్డిపట్ల గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు ఆనందంగా గడిపి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి రామానాయుడు–అనంత శ్రీరామ్ కలయిక పాలకొల్లు ప్రాంత ప్రజల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతూ, ఈ సంక్రాంతి సంబరాలకు మరింత విశిష్టతను తీసుకొచ్చింది.