మార్కెట్‌లో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కి కాస్త బోర్ కొట్టేసిందనిపించే సమయంలో, రియల్మీ కొత్తగా “Realme P4 Pro 5G”ని తీసుకొచ్చింది. చెప్పుకోవాలి అంటే, డిజైన్ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కానీ – అన్నింటిలోను కొత్త లెవెల్!
డిస్‌ప్లే & డిజైన్
ముందు డిస్‌ప్లే గురించి చెప్పుకుంటే – 6.8 ఇంచ్ HyperGlow AMOLED 4D Curve+ డిస్‌ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 6,500 నిట్స్ బ్రైట్నెస్ – అంటే బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i కవర్ ఉండడం వల్ల భయం తగ్గింది. కర్వ్‌డ్ స్క్రీన్, తక్కువ బెజెల్స్ వల్ల హ్యాండ్‌లో పక్కా ప్రీమియం ఫీల్ వస్తుంది.
Realme P4 pro 5G ప్రాసెసర్ & పనితీరు
ఇందులో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ వేశారు. ఇందులో ముఖ్యమైన ఆకర్షణ: పిక్సల్వర్క్స్ ఆధారం గా నడిచే హైపెర్విషన్ ఏ ఐ GPU ఉండడం తో అన్ని ఫీచర్స్ సక్రమం గా పనిచేస్తాయి. పైగా Airflow VC కూలింగ్ ఉండడం వల్ల ఎక్కువసేపు PUBG, BGMI, COD ఏది ఆడినా హీట్ ఎక్కువ అవదు.
కెమెరా
కెమెరా విషయంలో కూడా రియల్మీ ఎలాంటి కంప్రమైజ్ చేయలేదు.
రియర్ – 50MP Sony IMX896 ప్రైమరీ (OIS) + 8MP అల్ట్రావైడ్
ఫ్రంట్ – 50MP సెల్ఫీ
ఫోటోలు కానీ వీడియోలు కానీ – క్లారిటీ టాప్ క్లాస్. 4K @ 60fps షూట్ చేయొచ్చు. అలాగే AI Snap, Travel Snap Mode, Motion Stabilization లాంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే ట్రావెల్‌లో కానీ, వ్లాగింగ్‌లో కానీ బాగా వర్కౌట్ అవుతుంది.
బ్యాటరీ
ఇక బ్యాటరీ విషయానికి వస్తే – 7,000mAh భారీ బ్యాటరీ. అంటే ఒక రోజు కాదు, రెండు రోజులు కూడా టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. పైగా 10W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది – అంటే ఫ్రెండ్స్‌కి పవర్ బ్యాంక్‌లా కూడా వాడొచ్చు 😅.
అదనపు ఫీచర్లు
Android 15 with Realme UI 6.0
In-display Fingerprint + Face Unlock
IP65 & IP66 వాటర్ + డస్ట్ రెసిస్టెన్స్
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, టైప్-సీ పోర్ట్, IR బ్లాస్టర్
3 Android Major Updates + 4 Years Security Patches
ధర & వేరియంట్లు
8GB + 128GB – ₹24,999
8GB + 256GB – ₹26,999
12GB + 256GB – ₹28,999
ఆఫర్లు: బ్యాంక్ కార్డ్స్‌పై ₹3,000 తగ్గింపు + ఎక్స్చేంజ్‌లో అదనంగా ₹2,000.
కలర్స్: Birch Wood, Dark Oak Wood, Midnight Ivy.
నా అభిప్రాయం
నిజంగా చెప్పాలంటే – ఈ Realme P4 Pro 5G మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో సైలెంట్ హీరోలా నిలుస్తుంది. డిజైన్ ప్రీమియం, కెమెరా క్లాస్, బ్యాటరీ బ్రూటల్, ప్రాసెసర్ పవర్‌ఫుల్ – మొత్తానికి బడ్జెట్‌లో ఒక ఆల్‌రౌండర్!