ఉక్రెయిన్ సమస్యపై రష్యా మరియు యూరప్ దృష్టికోణాల్లో తేడాలు; భద్రతా, స్వతంత్రత, ప్రజాస్వామ్య, మరియు వ్యూహాల భిన్నతల విశ్లేషణ.
రష్యా దృష్టి: భద్రతా మరియు భౌగోళిక ప్రాధాన్యం
ఉక్రెయిన్ ఒక విచిత్రమైన పరిస్థితులలో ఉంది. యూరోప్ సమాజం మొత్తం దాని వెనకాలలేదు. అందులో ముఖ్యమైనది హంగేరీ. రష్యా తను సొంతంగా నిర్ణయం తీసుకోగలదు. రష్యా మరియు యూరప్ ఆలోచన ధోరణి కూడా చాలా తేడాగా ఉంది. ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటూ ఉక్రెయిన్ బలి పశువును చేస్తున్నాయి.
చాలాకాలంగా యుక్రెయిన్ కదలికల పై నిఘా పెట్టింది. ఎప్పుడైతే నాటోకి దగ్గరకావటం జరిగిందో అప్పుడు రష్యా తన సైనిక చర్య ద్వారా భౌగోళిక సరిహద్దులను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టి యూరోప్ పై రాజకీయ వత్తిడి పెంచింది. క్రీమ్‌యా అనుసంధానం (2014) తరువాత, రష్యా ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. రష్యా తాను “సంరక్షణ చర్యలు” మరియు రష్యన్ మాట్లాడే ప్రజల హక్కులను రక్షించడం కోసం ఈ యుద్ధాలను సమర్థిస్తోంది. రష్యా ఎప్పుడూ నాటో ను నమ్మదు. ఎందుకంటే యుక్రెయిన్ పై పాశ్చాత్య ప్రభావం పడితే అది యుక్రెయిన్ లో ఉన్న ఎథినిక్ రష్యన్ ప్రజలకు ముప్పుకింద రష్యా పరిగణిస్తుంది
యూరప్ దృష్టి: స్వతంత్రత మరియు ప్రజాస్వామ్య రక్షణ
ఒకవైపు , యూరప్ దేశాలు ఉక్రెయిన్ సార్వభౌమత్వం, స్వతంత్రత మరియు ప్రజల హక్కులను మక్కువతో రక్షించడం కోసం ప్రయత్నిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు ఆర్థిక, సామరిక, మానవతా సహాయం అందిస్తూ రష్యా దాడులపై ద్రుతమైన విమర్శలు వెలువరిస్తున్నాయి. యూరోప్ వ్యవహారమంతా గోడమీద పిల్లివాటం ల ఉంది. యూరోప్ , రష్యా నుంచి ఎనర్జీ కొంటుంది కానీ యుక్రెయిన్ ను బలిపశువును చేస్తూ, పైకి ప్రపంచానికి నీతులు కల్లబొల్లి కబుర్లు చెబుతుంది.
వ్యూహాల తేడాలు: నేరుగా చర్యలు vs డిప్లొమసీ
రష్యా–యూరప్ మధ్య వాదనలో, ఆర్థిక మరియు రాజకీయ పద్ధతులలో కూడా తేడాలు ఉన్నాయి. రష్యా సాధారణంగా నిబంధనలు, సానుకూలతలను విస్మరించి దాని ఉద్దేశాలను నేరుగా అమలు చేస్తుంది. కానీ యూరప్, సంయుక్త నిర్ణయాలు, ఆర్థిక నిషేధాలు, డిప్లొమసీ మార్గాలు ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
రష్యా తన భద్రతా కారణాలను చూపి తూర్పు యుక్రెయిన్ లేదా అందినంత భూభాగాన్ని కబళించడం. ఇక యూరోప్ డెమోక్రసీ, చట్టాలు అంటూ రష్యా దగ్గర ఎనర్జీ కొంటూ తమ స్వలాభాన్ని చూసుకోవడం. ఈ తేడాలు వాస్తవ యుద్ధ పరిణామాలను, గ్లోబల్ రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి.
ఎవరెన్ని మాట్లాడినా, నిజమేమిటంటే యుక్రెయిన్ లో ఉన్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడమే.